Amazon Alexa | అమ్మ దొంగా.. దొంగచాటుగా మీ మాటలు వింటున్న అలెక్సా.. జాగ్రత్త సుమా..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


||evarthalu||ఈవార్తలు, టెక్ న్యూస్ : Amazon Alexa | మీ ఇంట్లో అమెజాన్ అలెక్సా ఉందా? హే అలెక్సా అని ప్లే సాంగ్స్ అనగానే మంచి మంచి పాటలు పాడుతోందని సంబరపడుతున్నారా? ఏ విషయం అడిగితే ఆ విషయం టక్కున చెప్పేస్తోందని మురిసిపోతున్నారా? అయితే.. ఒక్క నిమిషం. అలెక్సా దొంగ చాటుగా మీ మాటలు వింటోందట. దాని ముందు మీరేం మాట్లాడుకున్నా, అది రికార్డు చేస్తోందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనుషులు ఎవరూ లేరు కదా.. మనం ఏం మాట్లాడుకున్నా ఎవరికీ వినిపించదు కదా అని అలెక్సా ముందు మాట్లాడారో.. అంతే సంగతులు. అలెక్సా రికార్డు చేస్తున్న ఆ డాటాను అమెజాన్ ఉద్యోగులు దొంగ చాటుగా వింటున్నారట.


అందుకే.. అలెక్సాను బెడ్రూం, రహస్య సంభాషణలు జరిపే చోట ఉంచటం ఎంత మాత్రం సేఫ్ కాదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు హాల్, కిచెన్ వంటి ఓపెన్ స్పేస్‌లోనే ఉంచాలని స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అమెజాన్ కంపెనీకి వివరణ కోరగా.. అలెక్సా మాటలు వింటున్నది నిజమేనని అంగీకరించింది. అయితే, రిసెర్చ్‌లో భాగంగానే తాము ఈ పని చేస్తున్నామని వివరించింది. అమెజాన్ కంపెనీలోని ప్రతీ ఒక్కరు రోజుకు 1000 దాకా రికార్డు సంభాషణలు వింటున్నారని తెలిపింది. ఆ సంభాషణలు వినే అధికారాన్ని కంపెనీలోని కొందరు ఉద్యోగులకు మాత్రమే ఇచ్చినట్టు స్పష్టం చేసింది. వినియోగదారులు కావాలనుకొంటే రికార్డు బటన్‌ను ఆఫ్ చేసుకొని ఉంచుకోవచ్చని పేర్కొన్నది.


అమెజాన్ అలెక్సాలో రికార్డు బటన్‌ను ఇలా ఆఫ్ చేయండి..

- ఫోన్‌లో అలెక్సా యాప్ ఓపెన్ చేయాలి

- సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి

- ప్రైవసీ అన్న ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

- మేనేజ్ యువర్ అలెక్సా డేటా ను సెలెక్ట్ చేసుకోవాలి

- హౌ లాంగ్ టు సేవ్ రికార్డింగ్స్ ను ఎంచుకొని డోంట్ సేవ్ రికార్డింగ్స్‌పై క్లిక్ చేయాలి

- కన్ఫార్మ్ నొక్కాలి

- కిందికి స్క్రోల్ చేసి ఇంప్రూవ్ అలెక్సా బటన్‌ను ఎంచుకొని యూజ్ వాయిస్ రికార్డింగ్స్‌ను సెలెక్ట్ చేయాలి

- అక్కడ ఆఫ్ చేస్తే మీరేం మాట్లాడిన రికార్డ్ అవ్వవు.



వెబ్ స్టోరీస్