10th exams Andhra Pradesh | ఎన్నికల ఎఫెక్ట్.. మార్చిలోనే పది, ఇంటర్ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

అమరావతి, ఈవార్తలు: పదో తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షలకు ఎన్నికల ఎఫెక్ట్ తగిలింది. ఏప్రిల్‌లో ఎన్నికలు ఉండే అవకాశం ఉండటంతో ఇంటర్‌తో పాటే, టెన్త్ పరీక్షలు కూడా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ‘ఏప్రిల్లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్తో పాటు పదో తరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు, అదే నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి’ అని తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. 

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌:

18-03-2024 - ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1 (గ్రూప్‌-ఏ)

18-03-2024 - ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1 (కాంపోజిట్‌ కోర్స్‌)

19-03-2024 - సెకండ్‌ లాంగ్వేజ్‌

20-03-2024 - ఇంగ్లిష్‌

22-03-2024 - గణితం

23-03-2024 - ఫిజికల్‌ సైన్స్‌

26-03-2024 - బయోలాజికల్‌ సైన్స్‌

27-03-2024 - సోషల్‌ స్టడీస్‌

28-03-2024 - ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 (కాంపోజిట్‌ కోర్స్‌)

28-03-2024 - ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1 (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌) 

30-03-2024 - ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)

30-03-2024 - ఎస్‌ఎస్‌సీ వొకేషనల్‌ కోర్స్‌ (థియరీ)

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్:

మార్చి 1 - సెకండ్ లాంగ్వేజ్

మార్చి 4 - ఇంగ్లిష్

మార్చి 6 - మ్యాథ్స్ 1ఏ/బొటనీ/సివిక్స్

మార్చి 9 - మ్యాథ్స్ 1బీ/జువాలజీ/హిస్టరీ

మార్చి 12 - ఫిజిక్స్/ఎకనామిక్స్-1

మార్చి 14 - కెమిస్ట్రీ/కామర్స్/సోషియాలజీ/ఫైన్ ఆర్ట్స్

మార్చి 16 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/లాజిక్ పేపర్-1

మార్చి 19 - మోడ్రన్ లాంగ్వేజ్/జియోగ్రఫీ పేపర్-1

ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్:

మార్చి 2 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2

మార్చి 5 - ఇంగ్లిష్-2

మార్చి 7 - మ్యాథ్స్ 2ఏ/బొటనీ/సివిక్స్-2

మార్చి 11 - మ్యాథ్స్ 2బీ/జువాలజీ/హిస్టరీ-2

మార్చి 13 - ఫిజిక్స్/ఎకనామిక్స్-2

మార్చి 15 - కెమిస్ట్రీ/కామర్స్/సోషియాలజీ-2

మార్చి 18 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/లాజిక్ పేపర్-2

మార్చి 120 - మోడ్రన్ లాంగ్వేజ్/జియోగ్రఫీ పేపర్-2

వెబ్ స్టోరీస్