భయపెడుతున్న కోడి గుడ్డు ధరలు.. ఒక్కో గుడ్డు ఎంతకు పెరిగిందంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

కోడిగుడ్డు బల వర్ధక ఆహారం. ప్రతిరోజు ఒక గుడ్డు చొప్పున తినాలని నిపుణులు చెప్తుంటారు. అయితే సాధారణ మార్కెట్లో కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. ఒక్క గుడ్డు ఏడు రూపాయలు పలుకుతోంది. ఒకవైపు కార్తీకమాసం, మరోవైపు అయ్యప్ప మాలధారణలతో ఆధ్యాత్మికత సంతరించుకున్న రోజులలో చికెన్ కు ప్రజలు దూరంగా ఉండటంతో చికెన్ ధర 240 రూపాయల నుండి 140 రూపాయలకు దిగి వచ్చింది. అందుకు భిన్నంగా నాలుగు రూపాయల నుండి ఐదు రూపాయలు ఉన్న కోడిగుడ్డు ఏకంగా ఏడు రూపాయలు పలుకుతోంది. దీనితో కోడిగుడ్లు కొనాలి అంటే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అంగన్వాడీ కేంద్రాలు బేకరీలు కోడిగుడ్డు ప్రధాన ఆహారంగా భావిస్తున్న నేపథ్యంలో అటు అంగన్వాడీ కేంద్రాలు ఇటు బేకరీల నిర్వాహకులు పెరిగిన కోడిగుడ్డు ధర చూసి భయపడుతున్నారు. భవిష్యత్తులో చలి పులి మరింత విజృంభిస్తున్న వేళ కోడిగుడ్డు ధర పెరగడం పట్ల సామాన్య మానవుడు విలవిలలాడుతున్నాడు. ఏడు రూపాయలు చెల్లించాలంటే ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది అంటున్నాడు.

వెబ్ స్టోరీస్