పాపం బీఆర్ఎస్.. అన్నీ కూలిపోతున్నాయ్.. సోషల్ మీడియాలో ఆడుకుంటున్న నెటిజన్లు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||కుప్పకూలిన మెయినాబాద్ ఇండోర్ స్టేడియం Photo: Instagram||

ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు గడ్డుకాలం వచ్చి చేరింది. తొమ్మిదేళ్ల పాలనను సాఫీగా సాగించిన ఆ పార్టీకి ఇప్పుడు కొన్ని సంఘటనలు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగటం, మొయినాబాద్‌ స్టేడియం కూలటం లాంటి ఘటనలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఇదే అదనుగా సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్లతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లకు కక్కుర్తి పడితే అన్నారం బ్యారేజీ మునిగింది, మేడిగడ్డ కుంగింది. యాదాద్రిలో నిర్మాణాలు చేపడితే ఒక్క వానకే మునిగింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాల్లో లోపాల వల్ల పైకప్పు పెచ్చులు ఊడుతున్నయి. గోడలు పగులుతున్నయి. తాజాగా మొయినాబాద్లో నిర్మిస్తున్న స్టేడియం కూడా అలాంటిదే. అందుకే కుప్ప కూలింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తి పడి నాణ్యతలేని నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రజాధనం వృధా అవుతోంది తప్ప ప్రజలకు ఏ ప్రాజెక్టు గానీ, ఏ నిర్మాణం గానీ అందుబాటులో లేకుండా పోతోంద’ని విమర్శిస్తున్నారు.

కాగా, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం సోమవారం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 10 మందికిపైగా గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వెబ్ స్టోరీస్