Lunar Eclipse : కార్తీక పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం.. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు అంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||(ప్రతీకాత్మక చిత్రం)||

ఈవార్తలు, గ్రహణ ఫలం: కార్తీక పౌర్ణమి రోజునే, అంటే.. నవంబర్ 8వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. భరణి నక్షత్రం మూడో పాదంలో రాహు గ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజున ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఏర్పడుతుందంటే.. మధ్యాహ్నం 02 : 38 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 06 : 18 నిమిషాలకు గ్రహణం వీడుతుంది. ఈ ఏడాది ఏర్పడే చివరి చంద్రగ్రహణం ఇదే.

గ్రహణ ప్రభావం ఇలా..

స్పర్శ కాలం - మధ్యాహ్నం 2 : 38 గంటలకు

మధ్య కాలం - మధ్యాహ్నం 4 : 28 గంటలకు

మోక్ష కాలం - సాయంత్రం 6 : 18 గంటలకు

ఆద్యంత పుణ్యకాలం - మొత్తం 3 : 40 గంటలు

ఏ రాశివారు గ్రహణం చూడరాదంటే..

భరణి నక్షత్రం మేషరాశిలో గ్రహణం పట్టడం వల్ల అశ్విని, భరణి, కృత్తిక, నక్షత్ర జాతకులు చూడకూడదు. అంటే.. మేష రాశివారు గ్రహణం చూడొద్దు. చంద్రోదయం సాయంత్రం 5:27 గంటలకు అవుతోంది. కాబట్టి విడుపు సమయంలో 51 నిమిషాల పాటు మాత్రమే గ్రహణం కనిపిస్తుంది. ఈ సమయంలో గర్భిణులు సాయంత్రం 5: 27 గంటల నుంచి సాయంత్రం 6: 18 గంటల వరకు కదలకుండా పడుకోవాలి.

చంద్రగ్రహణ దోషం పోవాలంటే..

మహామృత్యుంజయ మంత్రం అన్నింటికన్నా గొప్పది.

త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్|

ఉర్వారుక మివబన్ధనన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||

ఈ శ్లోకాన్ని జపిస్తే అన్ని పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. హనుమాన్ చాలీసా చదివినా దోషం తగ్గుతుంది.


Note : మత విశ్వాసాలను అనుసరించి మాత్రమే పై సమాచారం ఇవ్వటం జరిగింది. శాస్త్రీయ ఆధారాలు లేనందున పాఠకులు గమనించగలరు.

వెబ్ స్టోరీస్